![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం ఆట క్రేజీగా సాగింది. నిన్న మొన్నటి వరకు ఆటల్లో సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వలేదని సుమన్ శెట్టిని అన్నారు. కానీ ఇప్పుడు తన మెరుగైన ఆటతీరుతో ఆరోవారం ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇది సుమన్ శెట్టి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్ గా నిలిచింది. అదేంటో ఓసారి చూసేద్దాం.
నిన్న జరిగిన టాస్కులో తమ కంటెండర్‌షిప్ కాపాడుకొని నిలిచిన ఆరుగురు సభ్యులు ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి పాల్గొనాల్సిన టాస్క్ విడిపించు.. గెలిపొందు..ఈ టాస్కులో గెలిచిన జంటలోని ఇద్దరు సభ్యులు హౌస్ కెప్టెన్లు అవుతారు.. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి జంటలోనూ ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న సమాధి లోపల లాక్ అయి ఉంటారు.. జంటలోని మరో సభ్యులు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి అక్కడ తన పార్టనర్ ఉన్న సమాధిని సరైన కోడ్ ఎంటర్ చేసి విడుదల చేయాలి.. ఆ కోడ్ కనుక్కోవడానికి కావాలస్సిన క్లూ సమాధి లోపలే ఉంటుంది.. ముందుగా ఎవరు తమ పార్టనర్‌ని విడుదల చేస్తారో వాళ్లు ఈ టాస్కు విజేతలు అవుతారని బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. సమాధి లోపల ఉన్న సభ్యులికి ఒక వాకీ టాకీ మరియు ఒక టార్చ్ లైట్ ఇవ్వడం జరుగుతుంది.. జంటలో బయట ఉన్న మరో సభ్యులు సమాధి లోపల ఉన్న మీ పార్టనర్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఒక వాకీ అవసరం కాబట్టి ముందుగా ఆ సభ్యులు కేజ్‌లో ఉన్న తమ వాకీ ఏదో కనుక్కోవాల్సి ఉంటుంది.. అది కనుక్కోవడానికి అక్కడ ఉన్న వాకీస్‌లో తమ పార్టనర్ వాయిస్ గుర్తించి కేజ్ దగ్గర ఉన్న కీస్‌లో సరైన కీతో కేజ్ ఓపెన్ చేసి తమ వాకీని తీసుకోవాలి.. సమాధి లోపల ఉన్న ఫొటో బయట మీకు కావాల్సిన బాక్స్‌పై కూడా ఉంటుంది.. సమాధి లోపల ఉన్న వాళ్లు టార్చ్ వేసి చూసి అదేంటో స్పష్టంగా కనిపిస్తుంది.. దాన్ని బట్టి సరైన బాక్స్ ఓపెన్ చేసి అందులో కోడ్ గుర్తుపెట్టుకొని యాక్టివిటీ ఏరియాలో ఉన్న తమ పార్టనర్ సమాధి దగ్గరికెళ్లి అందులో కోడ్ ఎంటర్ చేసి మీ పార్టనర్‌ని విడుదల చేయాలి.. ఎవరైతే ముందుగా తమ పార్టనర్ సమాధిని ఓపెన్ చేసి విడుదల చేసి గార్డెన్ ఏరియాలో ఉన్న గంటని మోగిస్తారో వాళ్లు టాస్క్ విజేతలు అవుతారంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు.
ఈ టాస్కు ఇలా మొదలుకాగానే చకచాకా కేజ్ నుంచి వాకీ టాకీ తీసుకొని మాధురి ఇచ్చిన సూచనల ప్రకారం గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ కూడా ఓపెన్ చేసేసింది అయేషా. అలానే పరిగెత్తుకొని లోపలికి అయితే వెళ్లింది. కానీ అక్కడ మాధురి ఉన్న సమాధికి ఏర్పాటు చేసిన తాళానికి కావాల్సిన పాస్ వర్డ్ రాంగ్ ఎంటర్ చేసింది. దీంతో అది ఓపెన్ కాలేదు. మరోవైపు తర్వాత వెళ్లిన సాయి.. రమ్య ఏ బాక్స్‌లో ఉందో కనిపెట్టలేకపోయాడు. కానీ చివరిగా వెళ్లిన గౌరవ్ మాత్రం.. చాలా ప్రశాంతంగా సుమన్ శెట్టి పడుకున్న బాక్స్‌ని ఓపెన్ చేశాడు. దీంతో పరిగెత్తుకుంటూ ఇద్దరూ వెళ్లి గంట కొట్టేసి విన్ అయిపోయారు. సుమన్ శెట్టి అయితే ఫుల్ హ్యాపీ ఫీలైపోయాడు. రీతూ అయితే వచ్చి సుమన్ శెట్టి నుదుటి మీద కిస్ ఇచ్చింది.
![]() |
![]() |